ఎంపీపీ రాజాన శేషు యలమంచిలి : కూటమి ప్రభుత్వంతోనే ఎనలేని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీపీ రాజన్న శేషు అన్నారు. బుధవారం మండలంలోని గూండ్రుబిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పల్లె పండుగ - 2 కార్యక్రమంలో భాగంగా మంజూరైన రెండు సిమెంట్ రోడ్డు పనులకు మండల పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేషగిరి రావు (శేషు) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ భవనం నుండి ఓ.హెచ్.ఎస్.ఆర్ వరకు రూ. 5.80 లక్షల అంచనా విలువతో చేపట్టే సిమెంట్ రోడ్డు పనులకు, అలాగే యలమంచిలి శ్రీను ఇంటి నుండి ఈసారపు నూకరత్నం, కె. నాగేంద్ర శర్మ ఇంటి నుండి వాయిబోయిన రమణ ఇంటి వరకు రూ. 5.40 లక్షల అంచనా విలువతో చేపట్టే సిమెంట్ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న శేషు మాట్లాడుతూ మండల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయుటకు పూర్తి బాధ్యత వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నగిరెడ్డి అమ్మాజీ, అచయ్యనాయుడు, సర్పంచ్ వై. రాజేశ్వరి, జనసేన నాయకులు సర్వసిద్ధి హరి కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.