ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి, గుడ్డ సంచులను వినియోగించండి..
16/May/2026 22:00
Share:
మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు యలమంచిలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం జరిగే కార్యక్రమంలో మే నెల థీమ్ అయినటువంటి ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ -అనే అంశంపై స్వచ్ఛత కార్యక్రమాలు ఆఫీసర్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్, మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్, సచివాలయ, మెప్మా సిబ్బంది తో స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుండి కూరగాయల మార్కెట్ మీదుగా మెయిన్ రోడ్, భవనం వీధి ప్రాంతాలలో ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ అనే కార్యక్రమం పై అవగాహన ర్యాలీ ను ప్లకార్డ్స్ , స్లోగన్లతో చేపట్టడం జరిగింది. మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం అమలులో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించి గుడ్డ సంచులను ఇతర ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ ను అమ్మినా మరియు వినియోగించిన కూడా చట్టరీత్యా జరిమానాలు విధిస్తామని తెలియజేశారు. అనంతరం మానవహారం గా ఏర్పడి అక్కడి స్థానిక వర్తకులు , ప్రజలు, మెప్మా , సచివాలయ సిబ్బంది చేత కమిషనర్ స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు. 13 సచివాలయాల పరిధిలో ఉన్న వార్డులలో పై పేర్కొన్న అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ బి జె ఎస్. ప్రసాదరాజు, తాసిల్దార్ వరహాలు ,మున్సిపల్ మేనేజర్ విజయకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా. శ్రీనివాసరావు,మెప్మా సి ఎం ఎం. పద్మావతి ,మెప్మా, మున్సిపల్, సచివాలయ సిబ్బంది స్థానిక వర్తకులు, ప్రజలు పాల్గొన్నారు.