బాధలు తీర్చి.. ప్రజల్లో భరోసా నింపడమే మా బాధ్యత: బడేటి చంటి..
26/June/2026 19:04
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటూ వాటిని తొలగించి వారిలో భరోసా నింపే లక్ష్యంతోనే జవాబుదారీ పాలనకు శ్రీకారం చుట్టామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ప్రజల సమస్యలను తొలగించి, వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని స్ఫూర్తివంతంగా నిర్వహించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలు, వినతుల రూపంలో ఎమ్మెల్యే బడేటి చంటికి అందజేశారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కర్నీ ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే,,, వారి సాధకబాధకాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు తమకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని అర్జీలు అందించగా,,, మరికొందరు తమకు సామాజిక పెన్షన్ మంజూరు చేయించాలని వినతులు సమర్పించారు. అలాగే ఇంకొందరు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి ముందు ఉంచారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, అధైర్యపడొద్దని వారందరిలోనూ భరోసా నింపారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపిన ఆయన,,, మరికొన్ని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారదర్శక విధానాలతో జవాబుదారీ పాలనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇటు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలుసుకుంటున్నానని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి,,, అర్జీలు, వినతులు సమర్పించిన వారి వివరాలను సవివరంగా నమోదు చేసుకుని, తిరిగి వారి సమస్య తీర్చిన తర్వాత ప్రజల సంతోషాల్లో భాగస్వామినైనందుకు ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, బడిశెట్టి శ్రీనివాస్, మల్లెపు రాము తదితరులు పాల్గొన్నారు...