పేద విద్యార్థి ఆరోగ్యానికి అండగా “మనం చారిటబుల్ ట్రస్ట్”
05/April/2026 20:43
Share:
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన భీశెట్టి శ్రీనివాస్ (22) మాకవరపాలెం సమీపంలోని అవంతి కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో జరిగిన బైక్ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన దెబ్బ తగిలి, తల ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు.వైద్యులు వెంటనే శస్త్రచికిత్స అవసరమని సూచించగా, దానికి సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ తల్లిదండ్రులు అంత పెద్ద మొత్తాన్ని భరించలేక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు దాతల సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.ఈ విషయం తెలిసిన పలువురు దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన “మనం చారిటబుల్ ట్రస్ట్” సభ్యులు కూడా స్పందించి, తమ వంతుగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ మురుకుర్తి గోపి, వైస్ ప్రెసిడెంట్ ఎస్. సతీష్, వ్యవస్థాపక కార్యదర్శి పి. సురేష్, కోశాధికారి సీ.హెచ్. శ్యామలరావు, సభ్యులు కర్రి వీరు నాయుడు (మాస్టారు), ఏ. మణికుమార్, తంగేటి సూర్యప్రకాశ్, ఎమ్. ప్రసాద్, బొడ్డేటి సురేష్, దాడి రమేష్, హాకీ సాయి తదితరులు పాల్గొన్నారు.స్థానికులు, దాతలు మరింతగా ముందుకు వచ్చి శ్రీనివాస్ చికిత్సకు సహాయం చేయాలని కోరుతున్నారు. క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి