మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం యోగా,శ్రీమతి యస్.శ్రీదేవి.
22/June/2026 08:24
Share:
మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం యోగా ఉత్తమ సాధనం.
ప్రతి ఒక్కరూ ప్రతి రోజు యోగా ఆసనాలకు కొంత సమయం కేటాయించుకోవాలి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి ...
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు 12వ అంతర్జాతీయ యోగా-2026 దినోత్సవ సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి వై. శ్రీనివాస రావు అధ్యక్షతన యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా గురువు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగా అభ్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి మాట్లాడుతూ శారీరక మరియు మానసిక ఆరోగ్య పరిరక్షణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవచ్చునని అన్నారు. యోగా మన శరీరాన్ని దృఢంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక ఆరోగ్యం ముఖ్యమని అన్నారు. యాంత్రిక జీవితంలో ప్రతి వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దీనినే యోగాభ్యాసం ద్వారా అధిగమించవచ్చని సూచించారు. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో యోగ ఒక భాగంగా అలవర్చు కోవాలని, రోజుకు కనీసం ఒక గంట వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చును అని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ మిస్.యం.ప్రమీలా రాణి, ఇతర న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు