అనకాపల్లి ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు,పాఠశాల బస్సుల భద్రతపై దృష్టి

అనకాపల్లి ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు,పాఠశాల బస్సుల భద్రతపై దృష్టి

22/June/2026 20:08    Share:   

అనకాపల్లి పట్టణ పరిధిలోని ఎన్‌టీఆర్ జంక్షన్ వద్ద మోటారు వాహనాల తనిఖీ అధికారి లీలా ప్రసాద గారి తో కలిసి అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం . వెంకట నారాయణ గారు పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా పాఠశాల బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫైర్ ఎక్విప్‌మెంట్ (అగ్నిమాపక పరికరాలు), ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఇతర ప్రమాణాలు పరిశీలించబడ్డాయి. అదేవిధంగా బస్సులలో ప్రయాణిస్తున్న విద్యార్థుల భద్రతా ఏర్పాట్లు, డ్రైవర్లు మరియు సిబ్బంది నిబంధనల పాటింపు అంశాలను కూడా తనిఖీ చేశారు. పాఠశాల బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ, విద్యార్థుల రవాణాలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణం లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter