రాంబిల్లి పరిధిలో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి: రూ.28,070 నగదు స్వాధీనం 

రాంబిల్లి పరిధిలో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి: రూ.28,070 నగదు స్వాధీనం 

27/June/2026 21:22    Share:   

రాంబిల్లి, జూన్ 27: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మరియు పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ బి.మోహనరావు ఆదేశాల మేరకు, రాంబిల్లి ఇన్స్పెక్టర్ నరసింగరావు ఆధ్వర్యంలో ఎస్సై దినకర్ మరియు వారి సిబ్బంది శనివారం  తెల్లవారుజామునదారభోగాపురం లేఅవుట్ పరిధిలో జరుగుతున్న కోడిపందాల స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.​ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న తొమ్మిది మంది (9) నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.28,070/- ల నగదు, 9 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ బైకులు మరియు 7 పందెం కోళ్లను (3 సజీవంగా ఉన్నవి, 4 మృతి చెందినవి) స్వాధీనం చేసుకున్నారు.​ఈ మేరకు నిందితులపై రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు  నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై దినకర్ ఒక ప్రకటనలో తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter