ఏలూరులో డ్రోన్ కెమెరాలతో విస్తృత తనిఖీలు:త్రీ టౌన్ పరిధిలో నిఘా...
15/May/2026 19:08
Share:
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్,ఏలూరు డీఎస్పీ శ్రీ డి శ్రావణ్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు,ఏలూరు త్రీ టౌన్ పరిధిలో అత్యా ధునిక సాంకేతికతతో నిర్వహించిన తనిఖీ లను డ్రోన్ కెమెరా లతో ఏలూరు త్రీ టౌన్ పరిధిలో విస్తృత తనిఖీలను నిర్వహించినారు. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఏలూరు పట్టణాన్ని నేరరహితంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ గారి పర్యవేక్షణలో త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కోటేశ్వరరావు గారు, ఈగల్ సెల్ ఆర్‌ఎస్‌ఐ ఉదయ భాస్కర్ మరియు సిబ్బంది కలిసి తనిఖీలు చేపట్టారు.డ్రోన్ కెమెరాల ద్వారా మారుమూల ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు మరియు నేరస్తులు తలదాచు కునే అవకాశం ఉన్న ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా తనిఖీలు దీనివల్ల సాధారణ తనిఖీలకు సాధ్యం కాని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్ప దంగా కనిపించిన వ్యక్తులకు అక్కడి కక్కడే 'డ్రగ్ టెస్ట్ కిట్లు ద్వారా పరీక్షలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగా న్ని ప్రాథమిక దశలోనే గుర్తించి, యువత వ్యసనాల బారిన పడ కుండా కట్టడి చేయడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం.గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.నేరాల నివారణలో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాగం డ్రోన్ టెక్నాలజీని వాడు కోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాన్ని పర్యవేక్షిం చడం సాధ్యమైందని అధికారులు తెలిపారు.ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలి."అని ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు గారు తెలియ చేసినారు