యలమంచిలి  పేరంటాలపాలెం గ్రామానికి రూ.3 లక్షలతో విద్యుత్ స్తంభాలు, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు.

యలమంచిలి పేరంటాలపాలెం గ్రామానికి రూ.3 లక్షలతో విద్యుత్ స్తంభాలు, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు.

14/March/2026 19:19    Share:   


క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్  యలమంచిలి :
యలమంచిలి మండలం కొత్తలి గ్రామ పంచాయతీ పరిధిలోని పేరంటాలపాలెం గ్రామంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన జనసేన నాయకుడు పట్నాల దేవా తన సొంత నిధులతో సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేసి హైవే రోడ్డునుండి గ్రామం వరకు విద్యుత్ స్తంభాలు మరియు ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయించారు.
ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలో సరైన వెలుతురు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, కూలి కార్మికులు, మహిళలు రాత్రి వేళల్లో చీకట్లో భయాందోళనలతో ప్రయాణించాల్సి వచ్చేది. పాములు, ప్రమాదాలు లేదా దాడుల భయం మధ్య గ్రామస్తులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు.
ఈ సమస్యను గుర్తించిన జనసేన నాయకుడు పట్నాల దేవా తక్షణమే స్పందించి తన సొంత నిధులతో విద్యుత్ స్తంభాలు మరియు ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయించి గ్రామ ప్రజలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఎలమంచిలి శాసనసభ సభ్యులు సుందరపు విజయకుమార్ మరియు యలమంచిలి మండల అధ్యక్షులు రాజాన సూర్యచంద్ర శేషుగిరిరావు చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో యలమంచిలి మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టా లోవ కుమారి, జనసేన నాయకులు, కొత్తలి జనసేన నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter