ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఎమ్మెల్యే బడేటి చంటి

ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఎమ్మెల్యే బడేటి చంటి

14/April/2026 06:44    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి 
ఏలూరు, ఏప్రిల్ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు  ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. టిడ్కో గృహాలకు డీడీలు కట్టిన వారికి  ఈ నెలాఖరున ఆ సొమ్మును తిరిగి చెల్లించడం జరుగుతుందని చెప్పారు.
ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వినతులు అందజేశారు. ప్రతి ఒక్క సమస్యను సావధానంగా విన్న ఎమ్మెల్యే బడేటి చంటి... పూర్తి వివరాలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.అలాగే పలువురు లబ్ధిదారులు టిడ్కో  గృహాలకు తాము డీడీలు తీసామని, దానికి సంబంధించిన సొమ్ములు చెల్లించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ధ్వేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేవిధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ లో అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని మేళ్ళు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలుచేయనున్నట్లు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter