బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి

బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి

02/February/2026 16:37    Share:   

⏭️కార్పొరేట్ వ్యవస్థలకు వరాల జల్లు, పేదవాడికి కన్నీటి జల్లు...
⏩కేంద్ర బడ్జెట్లో ఆంధ్రాకి  మొండి చేయి
⏩రైతులకు గ్రామీణ కార్మికుల వ్యతిరేక బడ్జెట్, విద్యార్థుల ఆకాంక్షలు  నీరుగార్చిన బడ్జెట్... 
⏩అమరావతికి నిధుల కోత....
⏩పోలవరం ప్రాజెక్టుకు గతం కన్నా నిధులు తగ్గిస్తే ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేస్తారు రాష్ట్రానికి  పెనుభారం 
⏩బడ్జెట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత మైనింగ్ ప్రస్తావనే లేదు...
⏩డేటా సెంటర్లకు ప్రోత్సహకాలు,ఉపాధి హామీ పథకానికి నిధుల కోత....
ఈరోజు అనకాపల్లి జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ చిన్నియాదవ్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపించారని,కేంద్రం నుంచి నిధులు కేటాయింపు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని యాదవ్ అన్నారు,విశాఖ ఉక్కు,వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి,రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం పట్ల, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత మైనింగ్ కోసం ప్రకటనే లేదని యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు,రాష్ట్రానికి కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని,అప్పులు ఇప్పించి దానినే సహాయంగా ప్రకటించుకోవడం దారుణమని అన్నారు, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు గతంలో కన్నా నిధులు తగ్గించి మూడు వేల కోట్లకు కుదించారని ఈ నిధులతో పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని యాదవ్ అన్నారు,నిర్వాసితుల పునరావాసానికి 21 వేల కోట్ల అవసరం కాగా అందులో ఎంత కేటాయించారో కూడా చెప్పలేదని అన్నారు, నిర్వాసితులను గాలికి వదిలేస్తే పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుందని యాదవ్ అన్నారు, అమరావతికి గ్రాంట్ ఇవ్వడానికి బదులుగా అప్పులు ఇప్పించడం రాష్ట్రానికి పెనుబారం అవుతుందని యాదవ్ ఆవేదన వ్యక్తపరిచారు, ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టారని డేటా సెంటర్లకు ప్రోత్సాహకాలు ప్రకటించారని యాదవ్ మండిపడ్డారు,విద్యార్థుల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నీరుగార్చిందని జిడిపిలో 6 శాతం విద్యారంగానికి నిధులు కేటాయించడంలో విఫలమైందని కేవలం 0.3 మాత్రమే కేటాయించిందని విమర్శించారు,విద్యారంగంలో పిపిపి విధానంతో ప్రైవేట్ రంగాలను  భాగస్వామ్యం చేసేందుకు అనుగుణంగా అవకాశాలు కల్పించిందని, డిజిటల్ లెర్నింగ్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలను గాలికి వదిలేసి ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్ ఉందని అన్నారు,కేంద్ర బడ్జెట్ రైతులకు గ్రామీణ కార్మికులకు వ్యతిరేకంగా ఉందని,వ్యవసాయము గ్రామీణ జీవనోపాధిలో తీవ్రమవుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్థిక మంత్రి వ్యవసాయ రంగాన్ని చాలావరకు విస్మరించారని, చిన్న సన్న కారు రైతుల ప్రస్తావన ఒక్కసారి మాత్రమే వచ్చిందని గ్రామీణ కార్మికుల కోసం అస్సలు ప్రస్తావనే లేదని అన్నారు, రాయలసీమ  కడప ఉక్కు ఉత్తరాంధ్ర ప్రకాశం వెనకబడిన ప్రాంతాలకు పూర్తి అన్యాయం జరిగిందని అన్నారు,కూటమి నేతలు వారం వారం ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఇప్పించడంలో విఫలమయ్యారని యాదవ్ అన్నారు,ఈ బడ్జెట్లో రాష్ట్రానికి విడుదల చేయవలసిన నిధులలో రెండు లక్షల కోట్ల రూపాయలు కోత పెట్టారని యాదవ్ ఆవేదన వ్యక్తపరిచారు, ఈ బడ్జెట్ ప్రజల కోసం కానే కాదని కార్పొరేట్ వ్యవస్థల కోసమేనని యాదవ్ అన్నారు. ..

క్రైమ్ ఎనాలిసిస్ రిపోర్టర్ శ్యామ్
Breaking News

Subscribe our Newsletter