రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర..

రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర..

27/April/2026 13:46    Share:   

అనకాపల్లి: స్థానిక బైపాస్ రోడ్డులోని డైట్ కళాశాల ఎదురుగా శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టా ఐదు రోజుల మహోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర గారు నేడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల సమాజంలో శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని, లోక కల్యాణం కోసం ఇటువంటి మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భక్తుల సౌకర్యార్థం ట్రస్ట్ సభ్యులు చేస్తున్న ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక నేతలు మరియు భక్తులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter