ఆడ దూడల జననంతో  పాడి రైతుల ఆర్థిక అభివృద్ధి

ఆడ దూడల జననంతో పాడి రైతుల ఆర్థిక అభివృద్ధి

17/February/2026 18:37    Share:   

అనకాపల్లి ఫిబ్రవరి 17
గంటా గోవింద్. ఎడిటర్, ప్రకృతి వ్యవసాయం.
లింగ నిర్ధారిత వీర్యం ద్వారా ఉత్పత్తి అయ్యే ఆడ పెయ్యల వలన పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంద వచ్చని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ఎం. ప్రసాద్ అన్నారు. కసింకోట మండలం కన్నూరు పాలెం లో మంగళవారం జరిగిన లేగదూడలా ఆరోగ్య శిబిరాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ రామ్మోహన్రావు మాట్లాడుతూ లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్లు పాడి గేదెలకు ఇచ్చినట్లయితే ఆడ లేగ దూడలు జన్మిస్తాయని అన్నారు. కుక్కల అధిక సంతానోత్పత్తిని నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణఆపరేషన్లు చేస్తున్నామని రామ్మోహన్ రావు వెల్లడించారు. కన్నూరు పాలెం పశుసంవర్ధక శాఖ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డయానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశుసంవర్ధశాఖ అనకాపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బుక్కపట్నం సౌజన్య పలువురు పాడి రైతులు పాల్గొన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో పాడి రైతులకు క్యారియర్లు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు


Breaking News

Subscribe our Newsletter