ఏటికొప్పాక లో ఉచిత వైద్య శిబిరం – ప్రజలకు నాణ్యమైన సేవలు..!!

ఏటికొప్పాక లో ఉచిత వైద్య శిబిరం – ప్రజలకు నాణ్యమైన సేవలు..!!

12/April/2026 16:36    Share:   

క్రైమ్ అనాల్సిస్ స్పెషల్ రిపోర్టర్, ఏటికొప్పాక :
అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో ఆదివారం సన్‌షైన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో డా. ఆర్. గంగాధర్ (MBBS), డా. ఆర్. లక్ష్మి ప్రీతి (MBBS) తదితర అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ప్రత్యేకంగా ఎముకల సమస్యలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, చిన్నపిల్లల వైద్యం, సాధారణ రోగాల చికిత్స వంటి విభాగాల్లో సేవలు అందించారు. వైద్యులు మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మీ రాము, కాండ్రకోట చిరంజీవి, అన్నం బాబూజీ, నగిరెడ్డి అచ్చయనాయుడు, రాయి చలపతి, సరోజిరావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను, బత్తుల వెంకటరమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
Breaking News

Subscribe our Newsletter