ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన సీఐటీయూ

ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన సీఐటీయూ

23/May/2026 21:33    Share:   

దుప్పుతూరు  ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని పని ప్రదే శంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ సోము నాయుడు  మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సరిపడ నిధులు కేటాయించకపోవడంతో గ్రామీణ పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో అమలులో ఉన్న విధానాలను మార్చడం వల్ల కార్మికులకు పని దొరకడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్ యాప్ విధానం కారణంగా నెట్‌వర్క్ సమస్యలతో కార్మికులు గంటల తరబడి పనిస్థలాల్లో వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అలాగే వేసవి కాలంలో కార్మికులకు సమ్మర్ అలవెన్స్, మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్లు, టెంట్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించి, రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పని కోరిన ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  దేశంసెట్టి సత్యవతి, కొత్తమ్మ,  శెట్టి  లక్మి , మంగ ,ప్రగాఢ వరలక్ష్మితదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter