యలమంచిలి నరకప్రాయంగా స్పీడ్ బ్రేకర్లు..!

యలమంచిలి నరకప్రాయంగా స్పీడ్ బ్రేకర్లు..!

28/March/2026 18:58    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో రాంనగర్ రైల్వే గేట్ నుంచి ఏ.ఎస్.ఆర్ కాలనీ మీదుగా ఎర్రవరం అండర్‌పాస్ బ్రిడ్జి వరకు ప్రతి 100 మీటర్లకో భారీ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ప్రస్తుతం రాంనగర్ రైల్వే గేట్ మరమ్మత్తుల కారణంగా ఈ మార్గాన్ని ప్రధాన రాకపోకల మార్గంగా మార్చడంతో సమస్య మరింత తీవ్రమైంది.
పెద్దపల్లి, వెంకటాపురం, గొల్లలపాలెం, శేషుకొండ కాలనీ, రాంనగర్, టిడిడ్కో కాలనీ ప్రాంతాలకు చెందిన ప్రజలు రోజూ ఈ రహదారిపై ప్రయాణించాల్సి వస్తోంది. అయితే, అధిక ఎత్తులో నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి.
ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు,వయోవృద్ధులు,మరియు వెన్నునొప్పితో బాధపడుతున్నవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు సైతం వేగంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.రైల్వే గేట్ మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ఈ మార్గం అత్యవసరంగా వినియోగంలో ఉండటంతో,ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పీడ్ బ్రేకర్లను తొలగించాలి లేదా సవరించాలి అని స్థానికులు కోరుతున్నారు.మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter