నాదెండ్ల భాస్కరరావు గారి పార్థివ దేహం సందర్శించి నివాళులు అర్పించిన రెడ్డి అప్పల నాయుడు
23/April/2026 17:52
Share:
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారి అకాల మరణం.. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన రెడ్డి అప్పల నాయుడు గారు.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఏప్రిల్. పౌర సరఫరాల శాఖా మంత్రివర్యులు, ఏలూరు జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు, జనసేన పార్టీ PAC చైర్మన్ గౌరవ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ నగరంలోని జూబిలీహిల్స్ లో గల వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన పార్థివ దేహం వద్దకు వెళ్లి, పూలమాలలు అర్పించి, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు.. నివాళులు అర్పించిన వారిలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు, నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిఎంస్ చైర్మన్ శ్రీ చాగంటి మురళి కృష్ణ (చిన్న) గారు తదితరులు ఉన్నారు..