పెట్రోల్–డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏలూరులో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం..

పెట్రోల్–డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏలూరులో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం..

18/May/2026 20:55    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
రాష్ట్ర వైయస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెరిగిన పెట్రోలు డీజిల్ ధరల నియంత్రణకై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP)గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కూటమి ప్రభుత్వం మరో 'బాదుడే బాదుడు' మొదలుపెట్టిందని, అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఆ విషయాన్ని గాలికి వదిలేసిందని, దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్,డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని పెట్రోలు డీజిల్ పెంపు వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు.అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడమైనది.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter