క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, అచ్చుతాపురం : అచ్యుతాపురం లోని కైట్స్ విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మరోసారి తమ సత్తా చాటారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా అత్యుత్తమ మార్కులు సాధించి సంస్థకు గౌరవాన్ని తీసుకువచ్చారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వై. పూజిత 1000 మార్కులకు గాను 986 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఎస్. శ్రీలేఖ కూడా 986 మార్కులు సాధించారు. అలాగే ఎస్. కామేశ్వరి 982 మార్కులు సాధించి విశిష్ట ప్రతిభను కనబరిచారు.ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కూడా విద్యార్థులు అత్యుత్తమ స్కోర్లు నమోదు చేశారు. 470 మార్కులకు గాను పి. దేవి 460 మార్కులు సాధించగా, కె. హరిత 459, కె. సుష్మిత 456, ఆర్. కీర్తి నందిని 456, సి.హెచ్. నీళమణి 454 మరియు ఆర్. ప్రణవి 453 మార్కులు సాధించి విజేతలుగా నిలిచారు. విద్యార్థుల నిరంతర కృషి, పట్టుదలతో పాటు అధ్యాపకుల సమర్థ మార్గదర్శకత్వం వల్లే ఈ అసాధారణ ఫలితాలు సాధ్యమయ్యాయని కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను యాజమాన్యం మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.