ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ప్రజాప్రతినిధి.

ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ప్రజాప్రతినిధి.

21/May/2026 06:37    Share:   

జనవాణిలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన..!ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్..!!

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ :
జనవాణికి వచ్చే ఫిర్యాదుదారులకు సత్వరమే న్యాయం చేకూర్చే విధంగా అధికారులు పనిచేయాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.
బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజాన శేషు, కూటమి నాయకులు బొద్ధపు శ్రీనివాసరావు, ఊటకూటి రమేష్ నాయుడు, కొట్టారు శ్రీను మాస్టర్, చందర్రావు, లాలం సోమనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter