యలమంచిలి 23వ వార్డులో వివేకానంద మెమోరియల్ పార్క్ ఏర్పాటు.!
14/March/2026 19:22
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ యలమంచిలి : యలమంచిలి గ్రామ అభివృద్ధిలో భాగంగా 23వ వార్డులో చిన్నారులకు ఉత్సాహభరితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు “వివేకానంద మెమోరియల్ పార్క్” ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించారు. గ్రామ ప్రవాసాంధ్రులు మరియు మార్గదర్శకుల సహకారంతో పార్క్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా బ్లేడ్ ట్రాక్టర్‌తో పార్క్ స్థలాన్ని సమతలపరచి, అవసరమైన సామగ్రిని వాటి స్థానాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం సమయంలో సమర్థవంతమైన పారిశుధ్య కార్మికులు, గ్రామ జ్యోతి యువత సభ్యులు, డైరెక్టర్ మరియు కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ సహకారంతో గొయ్యిలు తవ్వడం చేపట్టారు. ఈ శ్రమదానం కార్యక్రమంలో గ్రామ పెద్దలు భైరవభట్ల శివరాం ఉత్సాహంగా పాల్గొని యువతను ప్రోత్సహించారు.