- శ్రీ శ్రీ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి మరియు నందీశ్వర స్వామి వార్ల ప్రథమ వార్షిక మహోత్సవం..
- ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక 18వ డివిజన్ గొల్లాయిగూడెంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి మరియు నందీశ్వర స్వామి ప్రతిష్ఠించబడిన బ్రహ్మసూత్రముతో కలిగిన శివలింగము మరియు నందీశ్వర స్వామి వారి మొదటి వార్షికోత్సవము, ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తి శ్రధ్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీ నందీశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. కృష్ణానది తీరమున స్వామివార్ల ఉత్సవమూర్తులకు మరియు స్వామివారి ప్రత్యేకమైన ఆభరణములకు అఘోర తాంత్రిక విధానములో ప్రముఖ కేరళ తంత్ర వాది మరియు కేరళ ఆస్ట్రాలజీ నిపుణులు ధనుష్ నంబూద్రి స్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన విశేష పూజలు, అభిషేకాల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ నందీశ్వర స్వామివారికి వివిధ పుష్పాలతో, తమలపాకులతో రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదుగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తుల కోలాహలం నడుమ శోభాయాత్రగా స్వామి వారికి మేళతాళములతో గ్రామోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి శ్రీ నందీశ్వర స్వామి వారి మొదటి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. శ్రీ నందీశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ కెల్లా చిన్నాగారు, కమిటీ సభ్యులు కె.వి.వి సత్యనారాయణ గారు (గురుస్వామి), వి.తేజ రాజేష్ కుమార్ గారు (గురుస్వామి), జనసేన ఏలూరు నగర అధ్యక్షులు వీరంకి పండు గారు, డివిజన్ ఇంచార్జి పల్లి విజయ్ గారు స్థానిక నాయకులు మానేపల్లి. గాంధీ గారు, మెండ విజయ్ గారు, బట్టు బద్రి గారు, భరత్ గారు, పల్లి రాజా, M. గణేష్ గారు, P. శ్యామ్ గారు భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.