నేడు అనకాపల్లి జిల్లాలో ఎంపీ సి.ఎం. రమేష్ పర్యటన..

నేడు అనకాపల్లి జిల్లాలో ఎంపీ సి.ఎం. రమేష్ పర్యటన..

07/April/2026 06:53    Share:   

నేడు అనకాపల్లి జిల్లాలో ఎంపీ సి.ఎం. రమేష్ పర్యటన.. "మన ఊరు – మన జెండా" కార్యక్రమంలో పాల్గొననున్న రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్
అనకాపల్లి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ మరియు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ గారు నేడు (మంగళవారం, 07.04.2026) జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బిజెపి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పలు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఎంపీ గారి పర్యటన షెడ్యూల్ వివరాలు:
ఉదయం 10:30 గంటలకు: అనకాపల్లి నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపేటలో జెండా ఆవిష్కరణ.
ఉదయం 11:00 గంటలకు: అనకాపల్లి నియోజకవర్గంలోని మార్టూరు గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం.
మధ్యాహ్నం 12:00 నుండి 2:00 వరకు: అనకాపల్లి పూడిమడక రోడ్డులో ఉన్న ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను స్వీకరిస్తారు.
సాయంత్రం 4:00 గంటలకు: పెందుర్తి నియోజకవర్గంలోని అరిపాక గ్రామంలో జెండా ఆవిష్కరణ.
సాయంత్రం 5:00 గంటలకు: పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంటలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమాల్లో బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.
Breaking News

Subscribe our Newsletter