అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లో బైక్‌కు తాడు కట్టి లాగుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..

అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లో బైక్‌కు తాడు కట్టి లాగుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..

18/May/2026 14:54    Share:   

పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి.   సిఐటియు 
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల  సామాన్యుడిపై ప్రభావం చూపుతుందని అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లో బైక్ కు తాడు కట్టి లాగి  నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అనేది దేశవ్యాప్తంగా ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇంధన ధరలు పెరగడం వల్ల కేవలం వాహనదారులే కాకుండా,సమాజంలోని ప్రతి వ్యక్తిపై ఆ ప్రభావం పడుతోందని 
ఇంధన ధరలు పెరిగినప్పుడు రవాణా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని దీనివల్ల మనకు నిత్యం అవసరమయ్యే    కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయిఅని.ఫలితంగా సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్ అస్తవ్యస్తమవుతోంది అన్నారు.
ట్రాక్టర్లు, పంపు సెట్ల కోసం డీజిల్ వాడకం వల్ల సాగు ఖర్చు పెరిగి రైతుపై భారం పడుతుందని అన్నారు.ప్రజా రవాణా బస్సు ఛార్జీలు, ఆటో ధరలు పెరగడం వల్ల సామాన్యుడి ప్రయాణం భారంగా మారుతోందని వస్తువుల ఉత్పత్తి మరియు పంపిణీ ఖర్చులు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది అన్నారు.పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని క్రూడ్ ఆయిల్ ధర బేరల్ 50 పౌండ్లు ఉన్నప్పుడు రేట్లు తగ్గాలి ప్రభుత్వాలు తగ్గించాల్సి వచ్చినప్పుడు రేట్లు తగ్గించకుండా సామాన్యులపై భారం మోపి ప్రభుత్వం కార్పొరేట్లకు పెట్టుబడులు రాబట్టే విధంగా చేశాయని సామాన్యుడి జీవితంలో నిత్యవసర వస్తువుగా మారినటువంటి వాహనాలు వాటికి కావలసిన ఇంధనం ఎంతైనా ప్రజలు కొంటారులే అనే భావంతో ప్రభుత్వాలు ఇష్ట రాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని లేని పక్షాన తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు మన రాష్ట్రంలో దొరికే ఆయిల్ నిక్షేపాలు ప్రవేట్ పెట్టబడుదారులకు కట్టబెట్టి మనకు పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లాలం నర్సింగరావు. శ్రీను, సత్యం, రాము ,రాజు, వాసు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter