పినరయి విజయన్ పై ఈడి దాడులను ఖండించండి - సిపిఎం

పినరయి విజయన్ పై ఈడి దాడులను ఖండించండి - సిపిఎం

28/May/2026 19:32    Share:   


కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ ఇళ్ళ పై ఈడి దాడులు నిర్వహించడం అన్యాయమని, ఈ చర్యలను తీవ్రంగా ఖండించాలని సిపిఎం పిలుపునిస్తోంది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రొంగలి రాము, కూండ్రపు సోము నాయుడు  మాట్లాడుతూ దేశంలో ఆదర్శంగా పేరు ప్రఖ్యాతిగాంచిన కేరళ రాష్ట్రంపై కేంద్ర బిజెపి ప్రభుత్వం, కేరళ రాష్ట్ర కాంగ్రెస్, దాడులకు పాల్పడుతుందని ఇది చాలా అన్యాయమని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రోజులలోనే ప్రతిపక్ష ముఖ్యమంత్రి పై ఇటువంటి ఈడీ దాడులు చేయించడం అమానుషమని ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని అన్నారు.మాజీ ముఖ్యమంత్రి ఇంటి తో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లపై కూడా ఈడి దాడులు చేయడం దారుణమని వాపోయారు. ఇది కేవలం కుట్రపూరితమైన దాడిలో భాగమేనని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే కేరళ మాజీ ముఖ్యమంత్రి పై దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సత్తిబాబు, ధర్మ రెడ్డి చినబాబు ,ఆర్ రాజశేఖర్ ,కె సత్తిబాబు , రెడ్డి ఒనుములు నాయుడు ,వి కిషోర్,ఆర్ సత్యం ,లాలం శీను ,పి అప్పలరాజు , ఎల్ రాము నాయుడు, డి అప్పలనాయుడు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter