
ఎలమంచిలి నియోజకవర్గ స్థాయిలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 58,290 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.21 కోట్ల 74 లక్షల రూపాయలు జమ చేయబడ్డాయి.
ఈ కార్యక్రమం రాంబిల్లి మండలం నారాయణపురంలో స్థానిక ఏడీఏ ఆధ్వర్యంలో జరిగింది. ప్రత్యేక అధికారి సందీప్ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి శ్రీ లచ్చన్న గారు మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం వలన భూమి ఆరోగ్యం, మానవ ఆరోగ్యం మెరుగుపడటమే కాక తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి రైతు తన భూమిలో కొంత భాగాన్ని ప్రకృతి వ్యవసాయానికి కేటాయించాలని సూచించారు.
ఈ సందర్భంగా BCT-KVK ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ శైలజ, డాక్టర్ వానా ప్రసాద్, డాక్టర్ సుబ్బారెడ్డి ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన రైతులు ఆసక్తిగా వీక్షించారు.
మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ, ఎరువులు కావాల్సిన రైతులు తప్పనిసరిగా APIMS యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని, రైతు సేవా కేంద్రాలు, డీలర్లు, సొసైటీల వద్ద పంటల సరళి, విస్తీర్ణం బట్టి దఫాదఫాలుగా ఎరువులు పొందాలని సూచించారు. ఈ కొత్త విధానంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ సహాయ సంచాలకులు సుమంత పాంప్లెట్లు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు సుమంత, మోహన్, శంకర్ గోవింద్, జ్యోత్స్న, అలాగే దిమిలి PACS అధ్యక్షులు శివశంకర్, నూకన్నదోర, అన్నం బాబ్జీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.