తమ ఫోన్లు తిరిగి వస్తాయని ఆశ వదిలేసు కున్న బాధితులు, పోలీసులు స్వయంగా ఇంటికి వచ్చి ఫోన్లను అప్పగించడంతో..
05/May/2026 19:51
Share:
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు పోలీసుల ప్రాజెక్ట్ రిస్టోర్ లో భాగముగా ఏలూరు పోలీసులు పౌర కేంద్రిత పోలీసింగ్ కార్యక్రమమైన ప్రాజెక్ట్ రిస్టోర్ లో గతములో నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తిని నిజమైన యజమానులకు వేగంగా, పారద ర్శకంగా జిల్లా వ్యాప్తంగా ది 05.04.2026 వ తేదీ నాడు 729 మంది బాధితులకు ₹2.93 కోట్ల విలువైన ఆస్తి తిరిగి అప్పగించారు. ఇందులో 1020 గ్రాముల బంగారం, ₹1.32 కోట్లు నగదు, 30 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 647 మొబైల్ ఫోన్లు మరియు ఇతర విలువైన వస్తువులు అందించారు కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. అదే స్ఫూర్తితో ఈ రోజు అనగా 05.05. 2026 వ తేదీ నాడు రెండో విడత పోలీస్ ప్రాజెక్ట్ రిస్టోర్ లో భాగముగా ఏలూరు సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ దాసు వారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా రికవరీ చేసిన 248 మొబైల్ ఫోన్ లను వాటి యొక్క విలువ 37,20,000/- రూ .లు ఏలూరు, జంగారెడ్డి గూడెం, పోలవరం మరియు నూజివీడు సబ్ డివిజన్ పోలీసు యంత్రాంగం నేరుగా బాధితుల ఇళ్ల కు వెళ్లి బాధితులకు వారి ఇంటి వద్ద వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను అంద చేసినారు. ఏలూరు జిల్లా పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజ లకు చేరువ కావడంలో ఏలూరు జిల్లా పోలీసు లు మరో సారి తమ ప్రత్యేకత ను చాటు కున్నారు.జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోగొ ట్టుకున్న *248 మొబైల్ ఫోన్లను వాటి యొక్క విలువ 37,20,000/- అత్యా ధునిక సాంకేతి కత తో రికవరీ చేసి, వాటిని నేరుగా బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి అందచేసి నారు. ఏలూరు, జంగా రెడ్డిగూడెం, పోలవరం మరియు నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదులను క్రోడీకరించి, మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా కేవలం కొద్ది రోజుల్లోనే 248 ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులను తగ్గిస్తూ, అవసరమైన ధృవీకరణ అనంతరం చట్టబద్ధంగా ఆస్తి అప్పగింత చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంపొందించడం, భద్రతా భావన బలోపేతం చేయడం, నేర నిరోధక అవగాహన కల్పించడం లక్ష్యంగా పోలీసులు తెలిపారు.
సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సమయం వృథా కాకుండా చూడటమే ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యం.
సైబర్ సెల్ విభాగం ఆధునిక సాఫ్ట్‌వేర్ లను వినియోగించి ఫోన్లను ట్రాక్ చేయడంలో అత్యంత ప్రతిభ కనబరిచింది.
పోలీస్ స్టేషన్ కు వెళ్ల కుండానే మా వస్తువు మాకు దక్కడం పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ గారి సమర్థ వంతమైన నాయకత్వంలో జిల్లా పోలీసులు అందిస్తున్న ఈ సేవలకు ప్రజల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.