యలమంచిలి : అధిక పాల దిగుబడికి రైతులు మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవాలని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు సూచించారు. రాంబిల్లి మండలం దిమిలిలో బుధవారం పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో నిర్వహించిన లేగ దూడల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ శిబిరానికి విశాఖపట్నం డివిజన్ ఉప సంచాలకులు పశుసంవర్ధక శాఖ డా. ఎమ్. చంద్ర శేఖర్, పశుగణాభివృద్ధి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. ఎస్ శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ శాఖలో భారత్ పశు ధాన్ యాప్ ద్వారా ప్రతి పాడి రైతు యొక్క పశువులకు 12 నెంబర్ గల టాగ్ నెంబర్ (ఆధార్ నెంబరు) ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మార్చి 1వ తేదీ నుండి ప్రతి రైతులు వారి యొక్క ఆధార్, ఫోన్ నెంబర్ అప్డేట్ చేయించుకోవాలని తెలిపారు. ఎవరైతే ఇది అప్డేట్ చేసుకున్నారో వారికి మాత్రమే ఇకనుంచి సేవలు అందుతాయని వివరించారు. కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మేలు జాతి అయిన పశువులను ఉత్పత్తి చేయవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో 69 పెయ్యలకు పాల్గొనగా అందులో 3 మేలైన పెయ్యలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే దూడలకు నట్టల నివారణ మందులు, మినరల్ మిక్స్చర్ ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి సహాయ సంచాలకులు డా. సిహెచ్. ఎమ్. ఎమ్ గంగాధర్, సోమలింగపాలెం పశువైద్యాధికారి డా. ఎల్. కన్నయ్య నాయుడు, పంచదార్ల పశువైద్యాధికారి డా. కె. రఘునాథ్, దిమిలి పశువైద్యాధికారిని డా.వి. శిరీష, మెబైల్ వెటర్నరీ క్లినిక్ డా. బి హరి ప్రియ, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, స్థానిక నాయకులు, పాడిరైతులు పాల్గొన్నారు.