ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 89% ఓటింగ్. 'ఎన్నికల అధికారి పిల్లా హర శ్రీనివాసరావు.'
13/February/2026 21:30
Share:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ అసోసియేషన్కు నూతన కార్యవర్గం ను ఎన్నుకునేందుకు ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రక్రియ శుక్రవారం అనకాపల్లి బార్ అసోసియేషన్ లో కోలాహలంగా జరిగింది. అనకాపల్లి బార్ అసోసియేషన్ పరిధిలో 265 మంది న్యాయవాదులు ఓటు హక్కును కలిగి ఉండగా వీరిలో 237 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీ చేసిన అభ్యర్థుల తరఫున స్థానిక న్యాయవాదులు వారికి మద్దతుగా నిలిచి ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించారు. కాగా ఈ ఎన్నికల్లో 89% ఓటింగ్ జరిగిందని ఎన్నికల అధికారి, అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లా హర శ్రీనివాసరావు తెలిపారు. కాగా ఈఎన్నికల్లో పొట్ట అప్పల నరసింహం తొలి ఓటును వేశారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి బంధం వెంకటరమణ,ఉపాధ్యక్షులు సుంకరశ్రీనివాసరావు పలువురు సీనియర్ న్యాయవాదులు ఓటింగ్లో పాల్గొన్నారు.