ఏలూరు లో అయామ్ హ్యాండ్సమ్ పోస్టర్ రిలీజ్ చేసిన MLA బడేటి, మేయర్ దంపతులు కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. # సుహాన్వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రవీణ్ రామరాజు సమర్పణలో...అయామ్ హ్యాండ్సమ్ అనే చిత్రాన్ని దుర్గా దేవ్ నాయుడు హీరోగా,మహేష్ గుడారు, కొమ్మిడి అర్చనా రెడ్డి, సీతంరాజు రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రానికి ఎన్ ఎస్ ప్రసు సంగీత సారథ్యం వహించారు కథానాయక గా అన్వీషా అలాగే అశోక్ ఆండ్ర, ఫణీంద్ర దేవరపల్లి, కిట్టయ్య, కేదార్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు... ఏలూరు కు చెందిన చిన్ని మార్కండేయులు గారి కుమారుడు దుర్గా దేవ్ నాయుడు గతంలో డైరెక్టర్ గా, రెండవ హీరోగా చేసిన ప్రవీణ్ ఐపీఎస్ చిత్రం విజయవంతం అవ్వగా,, ఇప్పుడు అయామ్ హ్యాండ్సమ్ చిత్రం ద్వారా సోలో హీరో గా మన ముందుకు రాబోతున్న సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు మేయర్ దంపతుల చేతుల మీదుగా చిత్రానికి కి సంబంధించిన పోస్టర్ ను, అలాగే లిరికల్ వీడియో సాంగ్ ను మీడియా సమక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా జరిగింది...