పోటీ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త.. యలమంచిలి లైబ్రరీలో కొత్త పుస్తకాలు.

పోటీ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త.. యలమంచిలి లైబ్రరీలో కొత్త పుస్తకాలు.

27/September/2026 10:18    Share:   

క్రైమ్ అనాలసిస్ రిపోర్టర్ ఆనంద్
 
యలమంచిలి: పుస్తక పఠనంతో సంపూర్ణ వికాసం సాధ్యమని, విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ సూచించారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం యలమంచిలి ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు.
 
పాఠకుల కోరిక మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో రూ.6 లక్షలతో కొనుగోలు చేసిన వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను పాఠకుల సమక్షంలో విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు, విద్యార్థులకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
 
లైబ్రరీ యాప్‌ను మరింత మంది వినియోగించేలా చూడాలని, పాఠకుల సౌకర్యార్థం వైఫై ఏర్పాటు చేయాలని లైబ్రేరియన్‌కు సూచించారు. గ్రంథాలయాల ప్రాధాన్యాన్ని విద్యార్థులు, నిరుద్యోగులకు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, లైబ్రేరియన్ వి. ఆనంద్, ఆడారి పూరి జగన్నాథ్, సోమయాజుల సన్యాసిరావు, పుల్లా వెంకటరావు, వై. అప్పారావు, ఎన్.వి. నరసింహం తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter