ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత తీర్థయాత్ర..

ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత తీర్థయాత్ర..

07/September/2026 19:02    Share:   

అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి, సెప్టెంబర్ 7 (CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్):

ఏటికొప్పాక గ్రామంలోని శ్రీ బండిమాంబ గుడి వద్ద నుంచి సోమవారం ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత తీర్థయాత్ర బస్సు బయలుదేరింది. పేదలు, వృద్ధులు, భక్తులు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునేలా ఈ సేవను ఏర్పాటు చేశారు. అన్నవరం, సింహాచలం, రుషికొండ పుణ్యక్షేత్రాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు.
ట్రస్ట్ సీఈఓ బలరామ్ మాట్లాడుతూ ఉచిత అంబులెన్స్, వైద్యం, అన్నదానం, దేవాలయాల పునర్నిర్మాణం వంటి సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటికొప్పాకలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ట్రస్ట్ నియోజకవర్గ ఇన్‌చార్జి గైపురి రాజు, బీజేపీ సీనియర్ నాయకులు సెన్నంశెట్టి శ్రీను, కాండ్రకోట చిరంజీవి, జనసేన పార్టీ ప్రెసిడెంట్ కొండయ్య నాయుడు, బీజేపీ నాయకులు మొల్లేటి ప్రసాద్, ఎల్‌ఐసీ బాబ్జి, అన్నం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter