అనకాపల్లి:
జిల్లా ఏర్పడిన అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ కార్యాలయం సొంత భవనంలో ప్రారంభం కావడం శుభపరిణామమని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ఆయన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. అనకాపల్లి అభివృద్ధికి జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం మరో ముందడుగని పేర్కొన్నారు. కార్యాలయం పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి సమావేశాలు, అతిథి గృహాలు, ఇతర పరిపాలనా అవసరాలకు అనుగుణంగా సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. శారదా నది ఒడ్డున ఉన్న జిల్లా పరిషత్ స్థలాన్ని కూడా అభివృద్ధి చేసి పార్కు, గెస్ట్‌హౌస్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అనకాపల్లి ఉత్తరాంధ్రలో అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా ఎదుగుతోందని, పారిశ్రామిక అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నిధులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు.
జిల్లా పరిషత్ కార్యాలయం ద్వారా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అనకాపల్లి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని కొణతాల రామకృష్ణ కోరారు.
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస అప్పికొండ