అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి డిఎస్పి శ్రీమతి శ్రావణి గారు సూచనలు మేరకు ఈ దినము అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొప్పాక గ్రామంలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రమైన శ్రీ సత్యమాంబ ఫైర్ వర్క్, అదేవిధంగా బాణాసంచా నిల్వకేంద్రాలైన రాజుపాలెం గ్రామంలో ఉన్న శ్రీ సూర్య తేజ ఫైర్ వర్క్, అదేవిధంగా వల్లూరు గ్రామంలో ఉన్న ఓం నమశ్శివాయ ఫైర్ వర్క్ లను అనకాపల్లి తాసిల్దార్ ఆనంద్ గారు, అనకాపల్లి ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు, అనకాపల్లి రూరల్ ఎస్సై శ్రీ రవికుమార్ గారు లతో తనిఖీ చేయడమైనది. తనిఖీల్లో ప్రధానంగా పరిశీలించిన అంశాలు: ఎక్స్‌ప్లోజివ్ రూల్స్ మరియు PESO నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే తయారీ/నిల్వ లైసెన్స్‌లు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు.షెడ్లలో అనుమతించిన పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.మిక్సింగ్, ఫిల్లింగ్, ప్యాకింగ్ మరియు ఎండబెట్టే విభాగాలు నిబంధనల ప్రకారం నిర్ణీత దూరంలో ఉన్నాయో లేదో పరిశీలించారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా స్పార్క్-ప్రూఫ్ సిస్టమ్స్ మరియు ఎర్తింగ్ సౌకర్యాలను తనిఖీ చేశారు. శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా? చైల్డ్ లేబర్ ఉన్నారా? సింథటిక్ దుస్తులు ధరించకుండా కాటన్ దుస్తులనే వాడుతున్నారా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అగ్నిమాపక పరికరాల లభ్యత, ఎగ్జిట్ పాయింట్లు మరియు పొగ త్రాగడంపై నిషేధం వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు.