వాడనరసాపురం శ్రీ దుర్గాలమ్మ పండగ మహోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

వాడనరసాపురం శ్రీ దుర్గాలమ్మ పండగ మహోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

25/April/2026 21:32    Share:   

క్రైమ్ అనాల్సిస్ – టివియస్ ప్రకాష్
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడనరసాపురం గ్రామంలో శ్రీ దుర్గాలమ్మ పండగ మహోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. వాడనరసాపురం ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌ను రాంబిల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రారంభించారు.ఈ టోర్నమెంట్‌ను చింతకాయల రాజు (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాంబిల్లి ఎస్‌ఐ, క్రీడాకారులు ఉత్సాహంగా, క్రీడాస్ఫూర్తితో పోటీలు ఆడాలని సూచించారు. యువత ఎక్కువ సమయం క్రీడా మైదానంలో గడపడం వలన శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఖాళీ సమయంలో క్రీడలను అభ్యసిస్తూ, విద్యలో కూడా రాణించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వాడనరసాపురం గ్రామానికి చెందిన పలువురు క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter