తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశానికే ఆదర్శంగా నిలచిన ఘనత నందమూరి తారక రామారావుగారికే దక్కుతుంది,
28/May/2026 20:06
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. తెలుగుదేశం పార్టీ స్థాపనతో సమైక్యాంధ్ర ప్రదేశ్ దశా-దిశా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో టిడిపిని స్థాపించిన ఎన్టీఆర్,,, ఆ దిశగా రాష్ట్రంలో అమలైన అనేక సంక్షేమ పథకాలకు ఆధ్యులుగా, తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఏలూరులో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా 4వ క్లస్టర్ పరిధిలోని అమీనా పేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన హైబ్రిడ్ మహానాడు వేదికపై ఎన్టీఆర్ జయంతి వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరుతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీని అనతికాలంలోని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కేవలం 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడమే ఒక సంచలనమైతే, అంతకు మించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు మరోక చరిత్ర అని ఆయన కొనియాడారు. అందుకే నేటికీ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా మిగిలిపోయారన్న ఎమ్మెల్యే చంటి,,,, ఆయన ఆశయ సాధనకు కార్యకర్తలంతా సమిష్టిగా పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ మహానాడు వేదికపై నుండి పార్టీ ముఖ్యులు వినిపించిన సందేశాలను శ్రద్ధగా ఆలకించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, ఆర్‌ఆర్ పేట శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ పాలడుగు రమాదేవి, నాయకులు ఆర్‌ఎన్‌ఆర్ నాగేశ్వరరావు, జుంజు మోజెస్ తదితరులు పాల్గొన్నారు...