యలమంచిలి “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రారంభం...

యలమంచిలి “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రారంభం...

22/May/2026 19:20    Share:   

కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ క్రైమ్ అనాల్సిస్
యలమంచిలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా 22/05/2025 నుండి20/06/2026 వరకు యలమంచిలి పురపాలక సంఘం పరిధిలో విజిబుల్ క్లీన్లీనెస్‌ను మెరుగుపరచుటకు  ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి రైల్వే స్టేషన్ వరకు మరియు భవనం వీధిలోని  పిచ్చి మొక్కలను తొలగించి కాలువలను క్లీనింగ్ చేయించి వెంటనే ట్రాక్టర్కు చెత్తను ఎత్తించడం  జరుగుతోంది. అదేవిధంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ,స్వచ్ఛమైన పట్టణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత చర్యలు,సుందరీకరణ, పచ్చదనం అభివృద్ధి,ఆధ్యాత్మిక సందేశాలతో అలంకరణలు మరియు మెరుగైన నిర్వహణ చేపట్టబడుతున్నాయి. దీని ద్వారా పట్టణ సౌందర్యం పెంపొందడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణ మరియు సాంస్కృతిక విలువలపై చైతన్యం పెంపొందించబడుతుంది. ఈ కార్యక్రమంలో కమిషనర్ బి జె ఎస్ పి రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు,శానిటరీ సెక్రటరీలు,శానిటరీ మేస్త్రీలు, శానిటరీ వర్కర్లు, ప్రజలు పాల్గొన్నరు.
Breaking News

Subscribe our Newsletter