తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ ...

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ ...

28/May/2026 20:15    Share:   

అనకాపల్లి, మే 28: కీర్తిశేషులు స్వర్గీయ N. T. Rama Rao జయంతి సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన అరుదైన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం ద్వారా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.నటనలోనూ, ప్రజా జీవితంలోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎన్టీఆర్, తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. ఒకప్పుడు దక్షిణ భారతీయులందరినీ “మద్రాసీలు”గా పిలిచేవారని, ఎన్టీఆర్ నాయకత్వం వచ్చిన తరువాతే “తెలుగువారు” అనే గౌరవప్రదమైన గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిందని అన్నారు.బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన ఆయన, తెలుగుదేశం పార్టీ స్థాపనకు 44 సంవత్సరాలు పూర్తయ్యాయని, అందులో 23 సంవత్సరాలు అధికారంలో కొనసాగడం దేశ రాజకీయ చరిత్రలో విశేషమని పేర్కొన్నారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని వ్యాఖ్యానించారు.అలాగే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter