ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం...
15/June/2026 21:10
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ దినోత్సవ సందర్భంగా మాదేపల్లి రోడ్ లోని ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 15న 'ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం' (World Elder Abuse Awareness Day) జరుపుకుంటారు. వృద్ధుల పట్ల జరిగే అన్యాయాలు, వివక్ష, మరియు వేధింపులపై సమాజంలో అవగాహన కల్పించడానికి, వారికి రక్షణ కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తామని, ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశo - వృద్ధుల పట్ల జరుగుతున్న మానసిక, శారీరక, మరియు ఆర్థిక వేధింపులను అరికట్టడం. వృద్ధాప్యంలో వారికి సరైన గౌరవం, ఆదరణ, మరియు జీవన భద్రత అందేలా చూడటం. వృద్ధుల సంక్షేమం కోసం ఉన్న చట్టాల (Maintenance and Welfare of Parents and Senior Citizens Act) గురించి తెలియజేయడం. వృద్ధాప్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ స్వంత కుటుంబ సభ్యుల నుండే నిర్లక్ష్యాన్ని, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆస్తుల కోసం వేధించడం, మరియు ఒంటరితనం వారిని తీవ్రంగా కుంగదీస్తున్నాయి. పెద్దలకు ఏదైనా అత్యవసర సహాయం, లేదా వేధింపుల సమస్య ఉంటే 15100 కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. వృద్ధలకు హానిని లేదా బాధను కలిగి౦చే ఏమైనా చర్యలను వృద్ధుల మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొనవచ్చు, వృద్ధుల భద్రత, శ్రేయస్సును పెంచడంలో సహాయపడే వనరులు, సేవలను, వారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేలా ప్రపంచాన్ని ప్రోత్సహించడం ఈ అవగాహన దినోత్సవ లక్ష్యం, పెద్దవారి వేధింపులు శారీరక, మానసిక లేదా భావోద్వేగ, లైంగిక, ఆర్థిక దుర్వినియోగం వంటి వివిధ రూపాలను తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా, అనేక దేశాలలో వృద్ధుల దుర్వినియోగ కేసుల సంఖ్య పెరుగుతుందని, పిల్లలను చిన్ననాటి నుండే క్రమశిక్షణ బాధ్యతతో పెంచడం వల్ల ఉమ్మడి కుటుంబాల పునర్దించడం వల్ల ఈ సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చని తెలియజేశారు మరియు కార్యక్రమంలో పానాల్ న్యాయవాది పి వెంకటేశ్వరరావు ఆశ్రమం సెక్రెటరీ కె. రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.ఎన్.వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.