సీఎం జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

సీఎం జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

20/April/2026 21:44    Share:   

‎కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
‎ఏలూరు, ఏప్రిల్ 20: 
కొద్ది రోజుల విరామం తర్వాత ఏలూరు వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్  ఏలూరు పార్లమెంట్ పరిధిలో  సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ముందుగా ఉదయం తన నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు తీసుకువచ్చిన కేక్ కట్ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్,  అనంతరం ఏలూరు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కట్ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉదయం 11.30 సమయంలో తన క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేక్ కట్ చేసి, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ‎CMRF చెక్కుల పంపిణీ..‎ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలలో పాల్గొన్న అనంతరం వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 60 మంది లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేశారు. రూ. 64 లక్షల విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ‎
మధ్యాహ్నం 12.30 సమయంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద అన్నా క్యాంటీన్ కు చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజనానికి వచ్చిన ప్రజలకు స్వయంగా  వడ్డించిన ఎంపీ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Breaking News

Subscribe our Newsletter