యలమంచిలి : పట్నంలోని పివి కాంప్లెక్స్ ఆవరణలో అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యలమంచిలి టైలర్ సొసైటీ అధ్యక్షులు వియ్యపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు టైలరింగ్ చేస్తూ జీవిస్తున్న వారి పరిస్థితి చాలా అద్వానంగా ఉంది షాపులు అద్దుల కట్టలేక కరెంట్ బిల్లులు చెల్లించలేక చేతినిండా పని లేక ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం ఆదుకోవాలని సబ్సిడీతో కూడిన లోన్లు ఇవ్వాలని అలాగే టైలర్ షాపులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించాలని తెలిపారు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని టైలర్లకు సామాజిక భవనం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుప్పట్ల శేషుబాబు, కట్ట సత్యనారాయణ, డి సూరిబాబు, పిల్ల శివ, కారుకొండ భద్ర, రైవాడ శంకర్రావు, మల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.