చిత్తూరు జిల్లా ఆంధ్ర జ్యోతి విలేకరి పై దాడి అమానుషం..జర్నలిస్ట్ సంఘ నేతలు..
29/April/2026 07:24
Share:
చిత్తూరు జిల్లా ఆంధ్ర జ్యోతి విలేకరి పై దాడి అమానుషం..దోషుల ను వెంటనే అరెస్ట్ చేసి మీడియా కు రక్షణ కల్పించాలి ఏపీ డబ్ల్యూ జె ఎఫ్, ఏపీ బి జె ఏ. ఏలూరు జిల్లా. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు :- చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగాకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలలని ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ , ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసాయి. చివరికి జర్నలిస్టులనుకూడా వేట కొడవళ్ల తో నరికి చంపే ఆటవిక స్థితిఈ రాష్ట్రంలో ఏర్పడిందని, శాంతిభద్రతలు దిగజారాయని అని జర్నలిస్ట్ సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో జర్నలిస్టుల జీవితాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చున్నా పేర్కొన్నారు. సమాజం అందరి క్షేమం కోరుకునే జర్నలిస్ట్ లు నిరంతరం భయంతో బతుకులు సాగించాల్సిన పరిస్థితి దాపురించిందాని వాపోయారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనీ. డిమాండ్ చేశారు.జర్నలిస్టులపై దాడులను నివారించేందుకు ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్,బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏలూరు జిల్లా శాఖలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్.శంకర్రావు, సీనియర్ నాయకుడు కె బాలసౌరి, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ డి జబీర్, కార్యదర్శి వై వి హరీష్, ఏపీబీజేఎ అధ్యక్షులు పి. నారాయణరావు, కార్యదర్శి కిరణ్ జరిగిన దాడిని ఖండించారు.