ఎంబీఏ విద్యార్థులకు Placement మరియి బ్యాంకింగ్ ఉద్యోగావకాశాలపై  ICICI బ్యాంక్ రీజినల్ హెడ్ అవగాహన సదస్సు..

ఎంబీఏ విద్యార్థులకు Placement మరియి బ్యాంకింగ్ ఉద్యోగావకాశాలపై ICICI బ్యాంక్ రీజినల్ హెడ్ అవగాహన సదస్సు..

16/March/2026 19:06    Share:   


Dt.16-3-2026
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) కళాశాలలోని ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేస్మెంట్స్ మరియు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగావకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 
 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసి ఐ సిఐ బ్యాంక్ రీజినల్ హెడ్  టి. సమీర్ గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంబీఏ విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు డిజిటల్ బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న విస్తృతమైన ఉద్యోగావకాశాలు, ప్లేస్మెంట్స్కు ఎలా సిద్ధం కావాలి, ఇంటర్వ్యూలలో ఎలా ప్రవర్తించాలి వంటి విషయాలను వివరంగా తెలియజేశారు.
విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని నిరంతరం కృషి చేస్తే మంచి కెరీర్ సాధించవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎం బీ ఏ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అతిథిని వివిధ ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠ రావు గారు మాట్లాడుతూ ఎంబీఏ కి అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అనగా ఎస్సే పి ( SAP) లో వివిధ మార్జిల్స్ ఉన్నాయని ఎంబీఏ స్పెషలైజేషన్ బట్టి అవి దాని ద్వారా ఉద్యోగాలు అవకాశాలు ఎన్నో ఉన్నాయని, అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా ఎంబీఏ విద్యార్థులకు అనేక అవకాశాలు ఎక్కువగా ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులు బ్యాంకింగ్ రంగంలో స్థిరపడుతున్నారని తెలియజేశారు చివరిగా ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ పి. బి. రామకుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంబీఏ విద్యార్థులు కోర్సు పూర్తిచేసుకుని ఐసిఐసిఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్లుగా ఉద్యోగాలు పొందుతున్నారని తెలియజేశారు అలాగే దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఐసిఐసిఐ బ్యాంకుతో ప్లేస్మెంట్స్ గురించిపరస్పర ఒప్పందం  చేసుకున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఎంబీఏ విభాగాధిపతి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter