ఏలూరులో వైభవంగా ఆలయ పునః నూతన శంకుస్థాపన: హాజరైన కూటమి ముఖ్య నేతలు

ఏలూరులో వైభవంగా ఆలయ పునః నూతన శంకుస్థాపన: హాజరైన కూటమి ముఖ్య నేతలు

09/July/2026 07:13    Share:   

ఏలూరు అగ్రహారం:
ఏలూరు అగ్రహారంలో వేంచేసియున్న శ్రీ జనార్దన, నగరేశ్వర స్వామి, మరియు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవార్ల పునః నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
జిల్లా టీడీపి అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారితో కలిసి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ మామిళ్ళపల్లి పార్థసారథి గారు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక శంకుస్థాపనలు చేశారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూటమి పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి మరియు అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు.

 
Breaking News

Subscribe our Newsletter