- ఎమ్మెల్యే విజయ్ కుమార్ యలమంచిలి : ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.బుధవారం పట్నంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.