# రాజీ కాదగిన కేసులు రాజీ చేసుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుంది, ఇరువురు చిరునవ్వుతో ఇంటికి వెళ్ళతారు. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి ... ఏలూరు, మార్చి 14: జాతీయ న్యాయ సేవాదికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలు ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించామని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ కాదగిన కేసులను రాజీ చేసుకోవడం ద్వారా డబ్బు, సమయం ఆదావుతుందని అన్నారు. కేసులు పరిష్కారంలో ఏర్పడిన జాప్యాన్ని నివారించడం కోసం జాతీయ లోక్ అదాలత్ సులువైన ఉత్తమమైన మార్గమని, దీన్ని ఉపయోగించుకుని కేసులు నుండి విముక్తి పొందాలని సూచించారు. ఈ రోజు సాయంత్రం 7:00 వరకు జరిగిన జాతీయలోక్ నందు 8,815 కేసులు రాజీ చేయబడినట్లు, అందులో 111 ప్రీ లిటిగేషన్ కేసులను, 147 మోటారు వాహన ప్రమాద భీమా కేసులను, 166 సివిల్ కేసులను, 94 చెక్ బౌన్స్ కేసులు, 36 కుటుంబ వివాదాలు కేసులు, 8261 కేసులు క్రిమినల్ మరియు ఇతర కేసులను రాజీ చేయడం జరిగిందని తెలిపారు. వాహన ప్రమాద భీమా కేసులలో రూ 6 కోట్లు పైబడి పరిహారముగా చెల్లించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి యు ఇందిరా ప్రియదర్శిని, ఐదవ అదనపు జిల్లా జడ్జి ఆర్.వి.వి.ఎస్.మురళీకృష్ణ, ఏడవదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాస రావు, ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, భార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కొనే సీతారాం, పిపి ఏ.వి.నారాయణ, ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్యం,లోక్ అదాలత్ సభ్యులు తమ్మినేని విజయకుమార్, ఏఎస్పి నక్కా. సూర్యచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.