టోక్యో: జపాన్ ఉత్తర తీరంలో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం 4:53 గంటలకు ఇవాటే (Iwate) ప్రిఫెక్చర్ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో
7.4 (రిక్టర్ స్కేలుపై)తీవ్రతతో భూమి కంపించినట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించింది. ఈ తీవ్ర ప్రకంపనల కారణంగా సముద్రంలో 3 మీటర్ల (సుమారు 10 అడుగులు) ఎత్తున సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తదుపరి హెచ్చరికల వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని జపాన్ ప్రభుత్వం సూచించింది. ప్రధానమంత్రి కార్యాలయం అత్యవసర బృందాన్ని ఏర్పాటు చేసింది.