ఏలూరులో 18,19 తేదీలలో రెండు రోజులపాటు ఏలూరు రైతు సంపద - మెగా మేళా
18/April/2026 19:52
Share:
ఏలూరులో 18,19 తేదీలలో రెండు రోజులపాటు ఏలూరు రైతు సంపద - మెగా మేళా మెగా మేళా లో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, ఏలూరు డిసిఎంఎస్ ఫంక్షన్ హాలులో ఈనెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు "సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా" ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ ఎరువులతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు వినియోగంపై అవగాహన కలిగించే నిమిత్తం ఈనెల 18, 19 తేదీలలో ఏలూరు రైతు సంపద పేరుతో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళాను ఏలూరు డిసిఎంఎస్ ఫంక్షన్ హాలులో నిర్వహించడం జరుగుతుందన్నారు. మన జిల్లాలోని రైతులు సహజ మరియు సేంద్రియ వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, రైతు-వినియోగదారుల మధ్య నేరుగా మార్కెటింగ్ విధానం కల్పించడం ఈ మేళా ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రసాయనిక ఎరువుల ద్వారా పండించిన ఆహార ఉత్పత్తుల వినియోగం కారణంగా కలిగే అనారోగ్యాలు, సేంద్రియ ఉత్పత్తుల వినియోగంతో పొందే ఆరోగ్య లాభాలపై అవగాహన కలిగించడంతోపాటు సేంద్రియ ఆహార ఉత్పత్తుల "ఎగ్జిబిషన్ మరియు అమ్మకం" జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లాలోని ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని "సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా" విజయవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.