బాటసారులకు దాహార్తిని తీర్చడం అభినందనీయం..బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు..
20/April/2026 07:33
Share:
హనుమాన్ నగర్ వంతెన వద్ద వీరంకి పండు ఆధ్వర్యంలో, శనివారపు పేట గాలిగోపురం వద్ద వాసా సాయి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, ఏప్రిల్ వేసవి తాపం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చే ఉద్దేశ్యంతో 19 వ డివిజన్ హనుమాన్ నగర్ వంతెన వద్ద ఏలూరు జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు ఆధ్వర్యంలో, 26 వ డివిజన్ శనివారపుపేట గాలిగోపురం వద్ద జనసేన నాయకులు వాసా సాయి గారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు.. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు గారు హాజరయ్యారు.. తొలుత వారిని శాలువాతో సత్కరించి పుష్ప గుఛ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికిన అనంతరం వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. గత 5 సంవత్సరాలుగా ప్రతి వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వీరంకి పండు, వాసా సాయి తెలిపారు. ఈ సందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రజలకు వేసవి వేడిమి కారణంగా కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జనసేన ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురౌతున్నారని పేర్కొన్నారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరి దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి స్టాల్స్ ఎంతో ఉపయోగకరమన్నారు. నిత్యం రద్దీగా ఉండే హనుమాన్ నగర్ మరియు శనివారపు పేట ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వీరంకి పండు, వాసా సాయి గారిని ప్రత్యేకంగా అభినందించారు.. మరీ ముఖ్యంగా శ్రామికులు, రైతు కూలీలు వంటి వర్గాలకు ఈ మజ్జిగ ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. ప్రతిరోజూ ఎండలో కష్టపడే శ్రామికులు శారీరకంగా అలిసిపోయే పరిస్థితుల్లో ఈ మజ్జిగ వారికీ శక్తీనిచ్చి సేదతీరడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు,బొత్స మధు, జగపతి మనోహరం స్వామి, అచ్యుత్, కొండేటి రమేష్, గొడవర్తి నవీన్, బుధ్ధా నాగేశ్వరావు, స్థానిక నాయకులు కొనికి మహేష్, దేవరపల్లి రత్నబాబు, టిడిపి నాయకులు వేమూరి శ్రీధర్, లంకపల్లి మాణిక్యాలరావు, చేకూరి గణేష్, సోమిశెట్టి రామ్మోహన్ రావు, బీజేపి నాయకులు గుమ్మడి చైతన్య, నడపాన దాన భాస్కర్ తదితరులు, భారీ సంఖ్యలో వీర మహిళలు, పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు