ఆత్మ వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ కార్య చరణ ప్రణాళిక  శిక్షణా కార్యక్రమం

ఆత్మ వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ కార్య చరణ ప్రణాళిక  శిక్షణా కార్యక్రమం

27/March/2026 07:32    Share:   

యలమంచిలి ఎస్. రాయవరం మండల పరిధిలో ఉన్నటువంటి అభ్యుదయ రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఆత్మ వారి సౌజన్యంతో చేపట్టడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రధాన శాస్త్రవేత్త నాగేంద్రప్రసాద్ బిసిటి హరిపురం వారు మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో వరి రకములను వేసేటప్పుడు పురుగులు మరియు తెగుళ్లు బెడద తట్టుకునే రకాలను నూతన వంగడాలను యుటిఆర్ 181 మరియు ఆర్జీఎల్ 7016 అలాగే ఎంటియు12 62 రకములను ఫౌండేషన్ మరియు బ్రీడర్ రకములను వేసుకోవాలని తద్వారా భూమి ఆరోగ్యవంతంగా ఉండాలంటే జనుము జీలుగా వంటి పచ్చరొట్ట ఎరువులను నెలలో వేసుకోవాలని మొదట ప్రాథమికగా తెలియజేశారు. కొక్కిరేపల్లి డాక్టర్ కుమారి ప్రధాని శాస్త్రవేత్త మాట్లాడుతూ రబీలో దేశంలోనే అగ్రగామిగా రిలీజ్ అయిన వై ఎల్ ఎం 146 రకమును రైతు సోదరులు వినియోగించుకోవాలని తద్వారా అధిక దిగుబడులు సాధించుటకు ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలు నువ్వు పంటకు మేలు చేస్తుంది, అని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యలమంచిలి మరియు ఎస్సీ రాయవరం మోహన్ రావు సౌజన్య మాట్లాడుతూ రైతులు ఆరోగ్యం వంతంగా ఉండాలంటే మిల్లెట్స్ చిరుధాన్యాలు పంటలు పండించుకోవాలని రాపేటి శ్రీనివాసరావు పొలంలో చోడి పంట వేసి ఉన్నారు దానిలో అంతరకృషి గురించి సైకిల్ వీడర్లు వాడే విధానం తెలియజేశారు జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి తులసీమని మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో ఎలినినో కారణంగా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని దాని పిదప నీటి ఎద్దడిని తట్టుకునే రకములను పంటలను వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తల అనుసరించి సలహాలు పాటించాలని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ. కార్యక్రమంలో రాపిడ్. శ్రీను మల్ల. బాబురావు సిద్దిల్లప్పారావు మల్ల. గణేష్ తోట. గణేష్ రాయవరం రైతుల అప్పారావు మరియు వ్యవసాయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter